August 10, 2026
Explore
రాజంపేటలో ఎయిడ్స్‌ అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ

రాజంపేటలో ఎయిడ్స్‌ అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ

August 10, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేటలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన ఐఈసీ పోస్టర్లను మున్సిపల్ కమిషనర్ ఎల్.లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. హెచ్‌ఐవీ నివారణ, పరీక్షలు, సకాలంలో చికిత్సతో పాటు అపోహలు, వివక్షను తొలగించడంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు ‘95:95:99’ రాష్ట్రస్థాయి ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటసుబ్బయ్య, సిబ్బంది వంశీకళ్యాణ్, శివయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Unveiling of AIDS awareness posters in Rajampet