March 26, 2026
Explore
మదనపల్లెలో భార్యాభర్తలపై చీటింగ్ కేసు నమోదు

మదనపల్లెలో భార్యాభర్తలపై చీటింగ్ కేసు నమోదు

March 26, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మండలం చిప్పిలిలో అంగన్వాడీ టీచర్‌ను బంగారం పేరుతో మోసం చేసిన భార్యాభర్తలపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం, సుకన్య, దేవేంద్ర తక్కువ ధరకే బంగారం తెప్పిస్తామని నమ్మబలికి, అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి నుంచి సుమారు రూ.30 లక్షలు తీసుకున్నారు. అనంతరం బంగారం ఇవ్వకుండా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Cheating Case Registered Against Husband and Wife in Madanapalle