August 9, 2026
Explore
ఆదివాసిల హక్కుల కోసం పోరాటం

ఆదివాసిల హక్కుల కోసం పోరాటం

August 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసిలకు ఇవ్వాల్సిన పథకాలను అందించడం లేదని , హక్కులను కాపాడుకునేందుకు పోరాటాలు సాగిస్తామని వైఎస్సార్‌సిపి ఎస్టీసెల్‌ ప్రధాన కార్యదర్శి మునీంద్రనాయక్‌ తెలిపారు. ఆదివారం స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌లో ఆదివాసిల దినోత్సవాన్ని గిరిజన మహిళలతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నినాదాలు చేశారు. ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో గిరిజనులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. హక్కులను పరిరక్షించుకునేందుకు గిరిజనులు పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులను సంరక్షించుకునేందుకు వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు ప్రభాకర్‌నాయక్‌, శ్రీరాములునాయక్‌, శ్రీనివాసులునాయక్‌, వాసునాయక్‌, రెడ్డెప్పనాయక్‌, బుడ్డన్ననాయక్‌, తిప్పానాయక్‌, నరసింహులునాయక్‌, రాజునాయక్‌, రవికుమార్‌నాయక్‌, శివశంకర్‌నాయక్‌, అంజినాయక్‌, శీన, దేవమ్మ, శారద, లీలావతి తదితరులు పాల్గొన్నారు.

Tags: Struggle for Adivasi rights