పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని పలు ఆలయాలలో ఆదివారం ఆషాడమాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని తూర్పుమొగసాలలో వెలసియున్న శ్రీచాముండేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి మాతజయంతి మహోత్సవం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే పట్టణ సమీపంలోని శ్రీపటాలమ్మ ఆలయంలో ఆషాడమాస పూజలు నిర్వహించి, అమ్మవారికి కుంకుమార్చనలు, దీపారాధన చేశారు. పట్టణంలోని ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో బజారువీధిలో గల శ్రీసీతారాముల ఆలయంలో శ్రీరామసప్తాహా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి , ఊరేగింపు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు, చెక్కభజనలు, కోలటలను మంగళవాయిద్యాల నడుమ నిర్వహించి, మంగళహారతులు ఇచ్చారు. ఆలయలలో పూజలకు భక్తులు అధిక సంఖ్యలో వెళ్లి పూజలు చేసి , మొక్కులు చెల్లించుకున్నారు.


Tags:Special prayers in temples