-అక్రమాలకు అధికార పార్టీ అండ
-నిద్రమత్తులో అధికారులు
- ఆందోళనకు సిద్ధమౌతున్న మహిళలు
పుంగనూరుముచ్చట్లు:
వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు విలువ చేసే ఇంటి స్థలాలను కొనుగోలు చేసి, పేద మహిళలకు ఇచ్చి జగనన్న కాలనీలను అభివృద్ధి చేశారు. ఇందులో ముస్లిం మహిళలకు చెందిన ఇంటి స్థలాలను అర్ధరాత్రి పథకం ప్రకారం జెసిబిలతో పునాదులు తీసి కట్టడాలు ప్రారంభించడంతో మహిళలు ఆందోళనకు గురౌతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు నిద్రమత్తులో ఉండటం విమర్శలకు దారితీస్తోంది. మండలంలోని రాగానిపల్లె గ్రామ దాఖల, పుంగనూరు బైపాస్‌రోడ్డులో ఉన్న ఆర్టీవో ఆఫీసు వద్ద మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేసి , పట్టణంలోని పేద మహిళలకు ఇంటి పట్టాలు మంజూరు చేశారు. సర్వేనెంబర్లు: 71, 73, 74 లలో గల స్థలాలలో 537 మంది మహిళలకు పట్టాలు ఇచ్చి, గృహాలు మంజూరు చేశారు. చాలా మంది నిర్మాణాలు చేసే సమయంలో ప్రభుత్వం మారడం, ముస్లింల పాలిట శాపంలా మారింది. నిర్మాణాలకు నిధులు లేకపోవడంతో అర్ధంతరంగా పనులు ఆగిపోయింది. ఇలాంటి సమయంలో దీనిని ఆసరాగా చేసుకున్న చోట తెలుగుదేశం నాయకుడు, వారి అనుచరులు వీరికి మద్దతుగా ఆర్టీవో ఆఫీసులో ఒక ప్రైవేటు ఏజెంట్ కుమ్మకై, రాత్రి సమయంలో జెసిబిలతో పునాదులు తీయ్యడం, రాత్రికిరాత్రే పునాదులు కట్టడంతో ఉదయానికళ్ళ స్థలాల రూపురేఖలు మార్చేస్తున్నారు. ఈ విషయమై లబ్ధిదారులు అడిగితే రూరల్‌కు చెందిన మహిళల పేరుతో నకిలి రికార్డులు సృష్టించి, పట్టణ లబ్ధిదారులను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూరల్‌కు చెందిన వారికి పట్టణాల్లో స్థలాలు ఇవ్వరాదన్న నిబంధనలు ఉన్న అధికార బలంతో తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కమిషనర్, తహశీల్ధార్‌కు ఫిర్యాదు చేసిన ఇద్దరు పట్టిపట్టనట్లు ఉండటంతో లబ్ధిదారులు ఆందోళనకు సిద్ధమౌతున్నారు.




Tags: Jagan’s house plots given to Muslims seized in the middle of the night