పుంగనూరుముచ్చట్లు:
అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం నందు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సిపి గిరిజన విభాగం నాయకులు డాక్టర్ బాణావత్ మునీంద్రనాయక్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ స్థానిక అంబేద్కర్ విగ్రహాం వద్ద ఉదయం 9 గంటలకు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం నిర్వహించి, ఆదివాసీల సంస్కతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించి, ఆదివాసిల హక్కులను కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags:Make Adivasi Day on the 9th a grand success.