-ర్యాలీకి పెద్దిరెడ్డి , మిధున్‌ల రాక
పుంగనూరుముచ్చట్లు:
డిఎస్సీలో అక్రమాలపై నిగ్గు తేల్చాలని , లోకేష్ రాజీనామ చేయాలని పుంగనూరు నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సిపి చేపట్టిన మూడు రోజుల రిలేదీక్షలు శనివారంతో సక్సెస్ అయింది. అలాగే ఈనెల 10న వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరులో జరిగే ర్యాలీకి వేలాది మంది హాజరుకావాలని పార్టీ క్యాడర్ మండలాల వారిగా కసరత్తు ప్రారంభించింది. ర్యాలీలో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిదున్‌రెడ్డి పాల్గొననున్నారు. ర్యాలీకి నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీక్యాడర్ పూర్తిస్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పుంగనూరు నుంచి ప్రభుత్వానికి వైఎస్సార్‌సిపి మూకుమ్మడి అల్టిమేటం ఇచ్చేలా ర్యాలీ చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.
Tags: Protests Successful – Preparations Underway for Rally on the 10th