August 8, 2026
Explore
నిరుద్యోగులకు చెవిలో పూలుపెట్టిన బాబు అండ్‌కో

నిరుద్యోగులకు చెవిలో పూలుపెట్టిన బాబు అండ్‌కో

August 8, 2026 | Andhra Pradesh

వైఎస్సార్‌సిపి నేతల వినూత్న నిరసన

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్రంలోని నిరుద్యోగులకు చంద్రబాబు అండ్‌ కో చెవిలో పూలు పెట్టి మోసం చేసిందని మాజీ ఎంపి రెడ్డెప్ప ఆరోపించారు. శనివారం మూడవ రోజు పట్టణంలోని ముడియప్ప సర్కిల్‌లో వైఎస్సార్‌సిపి నిరసన దీక్షలలో నాయకులు చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని, చంద్రబాబుకు నిజాయితి ఉంటే లోకేష్‌ చేత రాజీనామ చేయించాలని, అర్హులందరికి ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగులు నినాదాలు చేశారు. మాజీ ఎంపి మాట్లాడుతూ డిఎస్సీ అక్రమాలకు స్పోర్టస్ అసోసియోషన్‌ కారణమని ఆరోపించారు. స్పోర్టస్ కోటాలో ఉద్యోగాలను విక్రయించి, అర్హుల జీవితాలను నాశనం చేశారన్నారు. డిఎస్సీ ఫలితాలు విడుదల చేసి మెరిట్‌లిస్ట్ ఎందుకు విడుదల చేయలేదని నిలధీశారు. డిఎస్సీ కన్వీనర్‌ను ప్రక్కన పెట్టి, ఎన్‌సిఆర్‌టి డైరెక్టర్‌కు పరీక్షల బాధ్యత ఇవ్వడం అక్రమాలకు రాచమార్గం కల్పించినట్లని ఆరోపించారు. వైఎస్సార్‌సిపి శాంతియుత నిరసనలను పోలీసుల చేత అణచివేయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు వైఎస్సార్‌సిపి క్యాడర్‌ భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగులకు జీవనభృతి, విద్యార్థులకు ఫీజురియంబర్స్మెంట్‌ చెల్లించి, బాబు సర్కార్‌ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఐఏఎస్‌ అధికారులను మార్చి తనకు అనుకూలమైన వారిని నియమించి, అక్రమాలను అటకెక్కించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు , విద్యార్థులకు న్యాయం జరిగేదాక వైఎస్సార్‌సిపి పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి భాస్కర్‌రెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి హేమంత్‌రెడ్డి, పులిచెర్ల మండల నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రెడ్డిశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, వైఎస్సార్‌సిపి సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము , అధికార ప్రతినిది రాజశేఖర్‌రెడ్డి, యువజన సంఘ నాయకులు జయకృష్ణ, రాజేష్‌, హేము, బండకుమార్‌, మమ్ము, నూర్‌, మనోజ్‌, శివ, షరీఫ్‌, ఆసిఫ్‌, సుబ్బన్న , గోపి, ఈశ్వరాచారి, అస్లాంమురాధి, నయాజ్‌, ఆసిఫ్‌, నజీర్‌, వేణునాయక్‌, మనోజ్‌నాయక్‌, మాజీ కౌన్సిలర్లు రేష్మ, భారతి, సాజిదాబేగం, లలిత, జెపి.యాదవ్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Babu and Co., who put flowers in the ears of the unemployed