March 26, 2026
Explore
ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వడ్డీలో 50 శాతం రాయితీ!

ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వడ్డీలో 50 శాతం రాయితీ!

March 26, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై విధించిన వడ్డీలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 31తో ఈ గడువు ముగియనుందని అధికారులు తెలిపారు

రాయితీ అమలు ఇలా..
ప్రభుత్వం ఈ నెల 16న రాయితీ ప్రకటన చేయగా ఆ తర్వాత పన్ను వసూళ్లు పెరిగాయని అధికారులు తెలిపారు. అయితే, ఈ రాయితీ అమలులో రెండు విధానాలను అనుసరిస్తున్నారు.

గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 15 మధ్య వడ్డీతో సహా బకాయిలు చెల్లించిన వారికి, వారికి వర్తించే 50 శాతం వడ్డీ రాయితీ మొత్తాన్ని 2026-27 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్నులో సర్దుబాటు చేయనున్నారు.
ప్రభుత్వ ప్రకటన తర్వాత ప్రస్తుతం బకాయిలు చెల్లించేవారికి మాత్రం నేరుగా 50 శాతం వడ్డీని తగ్గించి వసూలు చేస్తున్నారు.

Tags: Good News from the AP Government for Property Tax Defaulters: 50% Rebate on Interest!