రాయచోటి ముచ్చట్లు:
ఆటోలో మరిచిపోయిన సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాల బ్యాగ్‌ను రాయచోటి అర్బన్ పోలీసులు 20 నిమిషాల్లో గుర్తించి బాధితురాలికి అప్పగించారు. కొత్తపల్లి కరిమియా మసీదు వీధికి చెందిన షేక్ మెహరాజ్ ఆటోలో ప్రయాణిస్తూ ఆరు తులాల బంగారం, 30 తులాల వెండి ఉన్న బ్యాగ్‌ను ఆటోలోనే మరిచిపోయారు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటోను గుర్తించి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ బి.వి. చలపతి, ఎస్‌ఐ ఎం.విష్ణువర్ధన్ ఆభరణాలను బాధితురాలికి అప్పగించారు. సీసీటీవీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలకంగా పనిచేస్తాయని పోలీసులు తెలిపారు.
Tags: Bag containing jewelry worth ₹10 lakh traced within 20 minutes.