అమరావతిముచ్చట్లు:
24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Tags: Low-pressure area… heavy rains