ఢిల్లీ ముచ్చట్లు:
జెడ్డా నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి వచ్చిన ఓ ప్రయాణికుడిని ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఐజీఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
ప్రయాణికుడి చెక్-ఇన్ సామానులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ టైర్ల భాగంలో చాకచక్యంగా దాచిన 24 క్యారెట్ల బంగారం 19 ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు 869.5 గ్రాములు.
ఎక్స్‌రే తనిఖీలో అనుమానాస్పద చిత్రాలు కనిపించడంతో సోదాలు నిర్వహించగా బంగారం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Tags: Gold smuggling foiled at Delhi airport.