బోరెడ్డిగారిపల్లి ముచ్చట్లు:
చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోj రూ.1.80 కోట్ల DMF నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. చాలాకాలంగా గ్రామ ప్రజలకు అవసరమైన రహదారి సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నూతన రోడ్డుతో గ్రామంలో రాకపోకలు సులభతరం కానున్నాయి. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే రహదారి ఇబ్బందులు తగ్గనున్నాయి.నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు.
Tags: Cement road worth Rs 1.80 crore in Boreddygaripalli inaugurated by Minister.