August 8, 2026
Explore
రాయచోటిలో వైఎస్సార్‌సీపీ యువగళం.. మూడో రోజూ హోరెత్తిన దీక్షలు

రాయచోటిలో వైఎస్సార్‌సీపీ యువగళం.. మూడో రోజూ హోరెత్తిన దీక్షలు

August 8, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటిలో YSRCP చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజూ కొనసాగాయి..యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ–2025 నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. స్పోర్ట్స్ కోటా నియామకాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరుద్యోగ భృతి అమలు చేయడంతో పాటు ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాయచోటి జిల్లా కేంద్ర హోదా పునరుద్ధరించాలని నాయకులు డిమాండ్ చేశారు. రిలే దీక్షలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.

Tags: YSRCP’s ‘Yuva Galam’ in Rayachoti: Protests continue in full swing for the third day.