అమరావతిముచ్చట్లు:
దేశంలోని ఏడు జ్యోతిర్లింగాలను ఒకే యాత్రలో దర్శించుకునేందుకు భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 25న ఢిల్లీలోని శబ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 11 పగళ్లు, 10 రాత్రులు కొనసాగుతుంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని జ్యోతిర్లింగాలతో పాటు ఉజ్జయిని మహంకాళి, ద్వారకా దీశ్ ఆలయం, రుక్మిణి దేవి ఆలయం, సోమనాథ్ ఆలయం, గణేష్ ఆలయం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. టికెట్ ధరలు రూ.88,810 నుంచి ప్రారంభమవుతాయి. ప్రయాణికులకు రైలులోనే అల్పాహారం, ట్రావెల్ అలవెన్స్ అందిస్తారు.
Tags: Special train tour to visit the seven Jyotirlingas.