August 8, 2026
Explore
రాయచోటిలో మూడో రోజుకు చేరిన వైఎస్సార్‌సీపీ GenZ దీక్షలు

రాయచోటిలో మూడో రోజుకు చేరిన వైఎస్సార్‌సీపీ GenZ దీక్షలు

August 8, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన GenZ దీక్షలు మూడో రోజుకు చేరాయి. దీక్షా శిబిరానికి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ తదితరులు సంఘీభావం తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వంపై యువతకు నమ్మకం కల్పించాలంటే సమగ్ర విచారణ అవసరమని నాయకులు పేర్కొన్నారు.

Tags: YSRCP GenZ protests in Rayachoti enter the third day.