August 8, 2026
Explore
కడప జిల్లా డిప్యూటీ కలెక్టర్ పై కేసు నమోదు

కడప జిల్లా డిప్యూటీ కలెక్టర్ పై కేసు నమోదు

August 8, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

వైసీపీ హయాంలో కోట్ల విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టినట్టు ఆరోపణలు

డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డితో పాటు ఎనిమిది మందిపై కేసు నమోదు

ప్రస్తుతం నెల్లూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న మహేశ్వర్ రెడ్డి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టిన వ్యవహారంలో ప్రస్తుత నెల్లూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వీఆర్వో, సబ్‌రిజిస్ట్రార్‌లు కూడా నిందితులుగా ఉన్నారు. కడప నగర శివారులోని సుమారు రూ.12 కోట్ల విలువైన భూమిని నకిలీ సర్టిఫికెట్లు, పత్రాల ఆధారంగా వేరొకరి పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది.

గతంలో సీకే దిన్నె తహశీల్దార్‌గా పనిచేసిన సమయంలో మహేశ్వర్ రెడ్డి వైసీపీ నాయకులతో చేతులు కలిపి ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రికార్డులను పరిశీలించి నకిలీ పత్రాల వ్యవహారాన్ని నిర్ధారించుకున్న అధికారులు, డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న మహేశ్వర్ రెడ్డి సహా మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

Tags: Case registered against Kadapa district Deputy Collector.