మదనపల్లె ముచ్చట్లు:
డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమం చేపట్టినట్లు మదనపల్లె డిఎస్పీ బుచ్చి రాజు తెలిపారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ కార్యక్రమం అంగళ్ళు లో చేపట్టామన్నారు.
మిట్స్, విశ్వం ఇంజనీరింగ్ కళాశాలల పరిసరాల్లో ఉన్న పీజీ హాస్టళ్లలో అద్దె ఇళ్లలో 105 మంది పోలీసులతో తెల్లవారుజామున ముమ్మర తనిఖీలు నిర్వహించా మన్నారు. డ్రోన్ కెమెరాలతో గగనతల నిఘా ఉంచి, సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనుమానితులకు నిర్వహించిన 53 డ్రగ్స్ పరీక్షలు నెగిటివ్‌గా రాగా, అనంతరం యువత, స్థానికులతో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. సీఐలు ఎస్ఐలు, ఈగల్ టీమ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags: ‘Operation Vajraprahar’ aims to eradicate drugs: DSP