మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లె డీఎస్పీ ఎం. బుచ్చిరాజు నేతృత్వంలో పోలీసులు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ నిర్వహించారు. అంగళ్లు ప్రాంతంలోని మిట్స్, విశ్వం ఇంజినీరింగ్ కళాశాలల పరిసరాల్లో పీజీ హాస్టళ్లు, అద్దె ఇళ్లలో 105 మంది సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులకు నిర్వహించిన 53 డ్రగ్స్ పరీక్షల్లో అన్ని నెగిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యువత, స్థానికులతో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు.
Tags: ‘Operation Vajraprahar’ aims to eradicate drugs.