కే.వీపల్లి ముచ్చట్లు:
కే.వీపల్లి మండలం జిల్లెల్లమంద పంచాయతీ బసన్నగారిపల్లిలో దారి తప్పిన ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. రైతుల వరి పైరును త్రొక్కి నష్టం కలిగించడంతోపాటు మామిడి తోటలో సుమారు 80 చెట్లను విరిచాయి. నీటి పైపులు, ఇనప కంచెను త్రొక్కి ధ్వంసం చేశాయి. రైతులు మనుబోతు నాగమ్మ, పచ్చిపాల నారాయణస్వామికి నష్టం వాటిల్లింది. ఘటనాస్థలాన్ని అటవీశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
Tags: Rampage by a herd of elephants… farmers’ crops flattened.