August 9, 2026
Explore
విరూపాక్షమ్మ తల్లి బోనాల సందర్భంగా మంత్రి విందు

విరూపాక్షమ్మ తల్లి బోనాల సందర్భంగా మంత్రి విందు

August 9, 2026 | Andhra Pradesh

చిన్నమండెం ముచ్చట్లు:

చిన్నమండెం మండల పరిధిలోని బోరెడ్డిగారిపల్లె సమీపంలో విరూపాక్షమ్మ తల్లి బోనాల సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విరూపాక్షమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు భోజనంలో ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి విందు కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరని పలకరించారు.

Tags:Minister’s banquet on the occasion of Virupakshamma’s mother’s birthday