అనంతపురం ముచ్చట్లు:
ఏపీ లో మరో ట్రావెల్ బస్సు ప్రమాదం….
అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.
పామిడి మండలం పొగరూరు సమీపంలో వ్యాన్‌ను ఢీకొన్న తర్వాత బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లింది.
ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి.
డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Tags: Travels bus overturns; 20 injured.