పీలేరు ముచ్చట్లు:
పీలేరు మండలం రామానాయక్ తండా సమీపంలో శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 45 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పీలేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏఎస్ఐ లక్ష్మీదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
Tags: Unidentified vehicle hits and kills man