పుల్లంపేట ముచ్చట్లు:
పుల్లంపేట మండలం అప్పయ్యరాజుపేట సమీపంలో రైలు కిందపడి వల్లూరు గ్రామానికి చెందిన పెద్దగాండ్ల నాగసుబ్బయ్య (45) మృతి చెందాడు. కుమార్తెను చూసేందుకు మూడు రోజుల క్రితం పెరియవరానికి వచ్చిన ఆయన ఈ ఘటనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న రేణిగుంట రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:Man dies after falling under train while visiting daughter