August 8, 2026
Explore
ఇంటర్ విద్యార్థి బలవన్మరణం

ఇంటర్ విద్యార్థి బలవన్మరణం

August 8, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

కళాశాల సిబ్బంది వ్యాఖ్యలతో తీవ్రమనస్థాపానికి గురైన ఓ వింటర్ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు,

కాకినాడ జగన్నాధపురం లోని జేరామారావుపేట
సమ్మెట వారి వీధికి చెందిన పైల రాంబాబు జ్యోతి దంపతుల రెండో కుమారుడు
పైల అరవింద్ 15 సంవత్సరాలు
ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నడు,

శుక్రవారం అరవింద్ అతని తండ్రి ఇద్దరు కళాశాలకు వెళ్ళినప్పుడు, చాలామంది సెకండ్ టర్మ్ కూడా కట్టేశారని

మీరు ఇంకా మొదటి టర్మ్ కట్టలేదని సిబ్బంది నలుగురు ముందు అనడంతో,
వారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు,

శుక్రవారం రాత్రి ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో విద్యార్థి అరవింద్ ఫ్యాన్ కి ఊరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు,

ఈ విషయమై కళాశాల ఉపాధ్యాయులు మరియు మీద కఠినంగా శిక్షించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు బంధువులు విద్యార్థులు కోరుతున్నారు.

Tags;Intermediate student dies by suicide