- డిఎస్సీ అక్రమాలపై సీబిఐ విచారణ చేయాలి
-దీక్షలకు న్యాయవాదులు మద్దతు - మాజీ ఎంపి రెడ్డెప్ప డిమాండ్
పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీలో పలు అక్రమాలకు పాల్పడిందని, దీనిపై సీబిఐచే విచారణ చేయించాలని విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ రాజీనామ చేయాలని చిత్తూరు మాజీ ఎంపి రెడ్డెప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ముడియప్ప సర్కిల్‌లో వైఎస్సార్‌సిపి రెండవ రోజు రిలేదీక్షలలో రెడ్డెప్ప పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, రాష్ట్ర కాపుసంఘ నాయకుడు మిద్దింటి కిషోర్, రాష్ట్ర యువజన సంఘ కార్యదర్శి కళ్యాణ్‌భరత్, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణంతో పాటు నిరుద్యోగులు, యువజన సంఘ నాయకులు దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా పట్టణ వైఎస్సార్‌సిపి న్యాయవాదులు మల్లికార్జునరెడ్డి, హరినాథరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రకాష్, ఆనందకుమార్ లు దీక్షల్లో పాల్గొని మద్దతు నిచ్చారు. ఈ సందర్భంగా లోకేష్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో దగా డిఎస్సీ నిర్వహించారని ఆరోపించారు. వీటిపై సీబిఐతో దర్యాప్తు చేయించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో సూపర్-6 అమలు చేయకపోయిన ప్రభుత్వం సూపర్-6 అక్రమాలకు మాత్రం కొదవ లేదని ఎద్దెవ చేశారు. అక్రమాలపై వైఎస్సార్‌సిపి పోరాటం కొనసాగిస్తుందని, నిరుద్యోగులకు అండగా ఉంటామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు విజయకృష్ణ, ప్రశాంతి, రఘునాథరెడ్డి, జహుర్, నూరి, ఇర్ఫాన్ తో పాటు వైఎస్సార్‌సిపి సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము , చౌడేపల్లె నాయకులు నాగభూషణ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాజారెడ్డి, నరసింహాయాదవ్, అంజిబాబు, శ్రీనివాసులు, పుంగనూరు నాయకులు సుబ్బన్న , కొండవీటి నటరాజ, ప్రశాంత్‌రెడ్డి, ఈశ్వరాచారి, రమణ, అనసూయ, యశోద, శ్రీనివాసులునాయక్, మహబూబ్‌బాషా, అస్లాంమురాధి, నయాజ్, ఆసిఫ్, నజీర్, వేణునాయక్, మనోజ్‌నాయక్, ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు మున్న తదితరులు పాల్గొన్నారు.


Tags: Lokesh must resign.