August 6, 2026
Explore
విద్యార్థుల ఆందోళనలపై బలప్రయోగం తగదు.పోలీసులకు సుప్రీంకోర్టు హెచ్చరిక

విద్యార్థుల ఆందోళనలపై బలప్రయోగం తగదు.పోలీసులకు సుప్రీంకోర్టు హెచ్చరిక

August 6, 2026 | Andhra Pradesh

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

విద్యార్థుల ఆందోళనల సమయంలో పోలీసులు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ‘శక్తిమంతమైన రాజ్యం’ పేరుతో బలప్రయోగానికి పాల్పడితే ఉద్రిక్తతలు మరింతగా పెరిగుతాయని న్యాయస్థానం పేర్కొంది. నీట్‌ పరీక్షల్లో అవకతవకలపై నిరసనల సందర్భంగా జంతర్‌మంతర్‌ వద్ద చెలరేగిన ఘర్షణలు, వాటికి సంబంధించిన పిటిషన్లపై బుధవారం విచారణ చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

సీజేపీ ఆధ్వర్యంలో నిరసనల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కూడా కోర్టు విచారించింది. మార్గదర్శనం లేని ఆందోళనకారులు రాళ్ల దాడులకు పాల్పడినప్పటికీ, హింసతో బదులివ్వడం సరికాదని సీజేఐ చెప్పారు. వారి ఆందోళనలకు కారణాలు తెలుసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. ఇలాంటి నిరసనలను ఎలా అదుపుచేయాలో నిర్ణయించే బాధ్యతను అనుభవజ్ఞులైన లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకే వదిలివేయాలని స్పష్టం చేశారు.

Tags: Use of force against protesting students is inappropriate: Supreme Court warns police.