- నాడు జగన్‌పై సీబిఐ విచారణకు రాజశేఖర్‌రెడ్డి అనుమతి
- నేడు సీబిఐ ర్ఖా•నికి రాకూడదంటున్న చంద్రబాబు
-బాబు సీబిఐతో చేయిస్తాడని నమ్మకం లేదు - లోకేష్ రాజీనామ చేయాలి
- కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
- మాజీ మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి డిమాండ్
పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీలో పలు అక్రమాలకు పాల్పడిందని, దీనిపై సీబిఐచే విచారణ చేయించి, నిగ్గుతేల్చాలని, వీటికి భాధ్యత వహిస్తూ నారాలోకేష్ రాజీనామ చేయాలని రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వైఎస్సార్‌సిపి అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పట్టణంలోని ముడియప్ప సర్కిల్‌లో పార్టీ తొలిరోజు రిలేదీక్షలను పెద్దిరెడ్డి ప్రారంభించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబిఐని ర్ఖా•నికే రాకూడదన్న చంద్రబాబు డిఎస్సీ అక్రమాలపై సీబిఐతో విచారణ చేయిస్తాడన్న నమ్మకం లేదని పెద్దిరెడ్డి ఎద్దెవ చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై పలు ఆరోపణలు వస్తే ఆనాటి అసెంబ్లిలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సీబిఐ విచారణకు అనుమతి ఇచి నిజాయితిని నిలుపుకున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. లీడర్ అంటే అలా ఉండాలి అంటు రాజన్నను కొనియాడారు. అదే విధంగా చంద్రబాబు కూడ నిజాయితీని నిరూపించుకునేందుకు సీబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో యువతియువకుల ఓట్ల కోసం మెగాడిఎస్సీని నిర్వహిస్తామని గొప్పలు చెప్పి, అధికారంలోకి రాగానే డిఎస్సీని కేవలం 16వేల మందిని మాత్రమే ఎంపిక చేశారని, అందులో తీవ్ర అవకతవకలు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అక్రమాలతో విద్యార్థులు ఆవేదనకు లోనై , నిరసన తెలిపారన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ఇందుకు బాధ్యత వహించాలని పెద్దిరెడ్డి నిలధీశారు. లోకేష్ తనకు కావాల్సిన వారికి , కూటమి పార్టీలోని నాయకులు, వారి అనుచరులు పరీక్షలు రాసిన , రాయకపోయిన ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ అవకతవకలపై లోకేష్ స్వచ్చంధంగా రాజీనామ చేసి తన సచ్చీలతను రుజువు చేసుకోవాలన్నారు. కానీ ఈ విషయంలో లోకేష్ నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విధంగా నీట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామ చేశారని పెద్దిరెడ్డి తెలిపారు. ఈ నిరుద్యోగులను ఆదుకునేందుకు , అక్రమాలను వెలికితీసేందుకు వైఎస్సార్‌సిపి రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తుందని తెలిపారు. అలాగే మూడు రోజులు నిరాహరదీక్షలు చేసి 10వ తేదీన భారీ ఎత్తున నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలు మరచిన ప్రభుత్వానికి జనసేన , బిజెపి మద్దతు ఇవ్వడం బాధ కరమన్నారు. ఈవిషయమై కేంద్రం జోక్యం చేసుకుని డిఎస్సీలో అక్రమాలపై లోకేష్ రాజీనామ చేసేలా రాష్ట్రంపై ఒత్తిడి తీసుకురావాలని పెద్దిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి రెడ్డెప్ప, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, జెడ్పిటిసి సోమశేఖర్‌రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి హేమంత్‌రెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, ఉమ్మడి జిల్లాల ఐటివింగ్ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి, జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కళ్యాణ్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Lokesh should resign, and the CBI should get to the bottom of the DSC irregularities.