అమరావతిముచ్చట్లు:
హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎల్పీజీ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. గ్యాస్ కొరతను చూపిస్తూ అదనపు సేవల ఛార్జీ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత పేరుతో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీసీపీఏ స్పందించింది.
ఎల్పీజీ గ్యాస్ పేరుతో కొన్నిహోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదులు వచ్చాయని, మీడియాలో కూడా వార్తలు వచ్చాయని వెల్లడించింది. మెనూలో పేర్కొన్న ధరలను మాత్రమే వసూలు చేయాలని, అదనంగా ఎలాంటి చార్జీలు ఉండకూడదని స్పష్టం చేసింది.
Tags: Do not levy additional charges in the name of LPG: Central Government warns hotels and restaurants.