అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBV)లో ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల జాబితాను సంబంధిత మండల విద్యాధికారుల (ఎంఈఓ) కార్యాలయాల్లో విడుదల చేశారు. అభ్యర్థులు తమ పేర్లను సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.
జాబితాలో పేర్లు ఉన్నవారు ఆగస్టు 10న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. ఒరిజినల్ విద్యా, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు రెండు సెట్ల అటెస్టెడ్ ప్రతులు తీసుకురావాలని తెలిపారు.
నిర్ణీత తేదీన హాజరుకాని వారి దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త నున్నా అనూరాధ స్పష్టం చేశారు.
Tags: Certificate verification for KGBV posts on August 10.