పీలేరు ముచ్చట్లు:
పీలేరు పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో సుమారు 2,000 ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు ఆర్టీసీ బస్టాండ్, వారపు సంత, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎన్నేళ్లుగా రైల్వే ట్రాక్‌పై ఉన్న దారినే ఉపయోగిస్తున్నారు. బుధవారం ఆ మార్గాన్ని రైల్వే శాఖ మూసివేసే చర్యలు ప్రారంభించడంతో కాలనీవాసులు శాంతియుత నిరసన చేపట్టారు. దారి మూసివేస్తే రెండు నుంచి మూడు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుందని, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు మాత్రం డీఆర్‌ఎం ఆదేశాల మేరకు ప్రజల భద్రత, ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులతో చర్చించి ప్రత్యామ్నాయ రహదారి లేదా ఫ్లైఓవర్ ఏర్పాటు కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు తమ నిరసనను విరమించారు.
Tags: Peaceful protest against closing the path across the railway track.