August 5, 2026
Explore
12 నుంచి జిల్లాలో ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు

12 నుంచి జిల్లాలో ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు

August 5, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12 నుంచి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ రాధిక తెలిపారు. హైరిస్క్ గ్రామాలు, కళాశాలలు తదితర ప్రాంతాల్లో రెండు నెలల పాటు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. హెచ్‌ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరా నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాలను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Tags: AIDS awareness programs in the district from the 12th