కలికిరి ముచ్చట్లు:
కలికిరి మండలం కె.రెడ్డివారిపల్లిలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 1256 మంది రైతులకు రాజముద్రతో కూడిన నూతన పాస్‌బుక్కులను పంపిణీ చేశారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళనతో భూ వివరాలను స్పష్టంగా నమోదు చేసి రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, భూ సమస్యలు లేని నియోజకవర్గంగా పీలేరును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Tags: Royal Seal Passbooks distributed to 1256 farmers