రాజంపేట రాజంపేట
రాజంపేట పార్లమెంట్ జనసేన సీనియర్ నాయకుడు రామా శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించారు. చేయేరు నదిలో ఇసుక దోపిడీకి పునాది ఏ ప్రభుత్వ హయాంలో పడిందో కూడా చెప్పాలని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌పై చేస్తున్న విమర్శలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. చేయేరు నది విధ్వంసం, ఇసుక అక్రమ రవాణా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆరోపించారు. గత పాలనలో జరిగిన పరిణామాల కారణంగానే ప్రజలు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని అన్నారు.
Tags: Gadikota Rama Srinivasulu counters on the Cheyyeru sand issue.