అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
ఆదాయపు పన్ను శాఖ పేరుతో వాట్సాప్‌లో వస్తున్న నకిలీ నోటీసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు లేదా .zip, .exe ఫైళ్లను క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపదని, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నమ్మవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
Tags: Cyber frauds in the name of the Income Tax Department—stay vigilant: District SP