వీరబల్లి ముచ్చట్లు:
వీరబల్లి మండలం సానిపాయ గ్రామంలో ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనే అంశంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో 60–80 శాతం వరకు వర్షపాత లోటు నమోదైన నేపథ్యంలో పంట బీమా, మల్చింగ్, నీటి పొదుపు పద్ధతులు పాటించాలని శాస్త్రవేత్తలు సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రైతులకు వివరించారు.
భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలని, సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అనంతరం సజ్జ, వేరుశనగ పంటలను పరిశీలించి రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. రసం పీల్చే పురుగుల నివారణకు అవసరమైన మందులు, పిచికారీ మోతాదులపై సూచనలు అందించారు. రైతులు ఈ-పంట నమోదు, పంట బీమా తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.
Tags: Impact of El Niño: Scientists raise awareness among farmers.