August 5, 2026
Explore
ప్రతి పాఠశాలలో స్కౌట్–గైడ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి : DEO

ప్రతి పాఠశాలలో స్కౌట్–గైడ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి : DEO

August 5, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం స్కౌట్ ప్రవేశాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో స్కౌట్–గైడ్ యూనిట్లు ఏర్పాటు చేసి విద్యార్థులను ఉద్యమంలో భాగస్వాములను చేయాలని సూచించారు.

స్కౌటింగ్ ద్వారా నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి పెంపొందుతాయని తెలిపారు. రాజ్యపురస్కార్ పొందిన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. స్వాతంత్ర దినోత్సవ మార్చ్‌పాస్ట్ కోసం 32 మంది స్కౌట్స్, 32 మంది గైడ్స్‌ను ఎంపిక చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, స్కౌట్ మాస్టర్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags: Scout-Guide units must be established in every school: DEO