August 5, 2026
Explore
చౌక దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చమర్తి

చౌక దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చమర్తి

August 5, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలోని చౌక దుకాణాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలిస్తూ స్వయంగా బియ్యం తూకం వేసి పంపిణీ చేశారు.

అనంతరం డీలర్‌ను నెలలో సరుకుల పంపిణీ తేదీలు, అందించే నిత్యావసర వస్తువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. సరుకుల పంపిణీలో పారదర్శకత పాటించాలని అధికారులకు, డీలర్‌కు సూచనలు చేశారు.

Tags: Chamarthi conducts surprise inspection of fair price shop.