రాయచోటి ముచ్చట్లు:
రాయచోటిలో నిర్వహించిన “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు గాజుల ఖాదర్ బాషా పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాలు ఎల్లప్పుడూ టీడీపీకి అండగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుండటాన్ని చూసి వైఎస్సార్‌సీపీ తప్పుడు ఆరోపణలు, ధర్నాలు చేస్తోందని విమర్శించారు. ప్రజలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Tags: TDP stands by the downtrodden and weaker sections: Gajula Khadar Basha