August 5, 2026
Explore
మైనర్లకు ద్విచక్ర వాహనాలు కేసులు నమోదు చేస్తాం : ఎస్‌ఐ

మైనర్లకు ద్విచక్ర వాహనాలు కేసులు నమోదు చేస్తాం : ఎస్‌ఐ

August 5, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

సమైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని సంబేపల్లి మండలం ఎస్‌ఐ రవికుమార్ హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ప్రజల సహకారంతో ప్రమాదాలను నివారించవచ్చని ఎస్‌ఐ తెలిపారు.

Tags:Cases will be registered against minors driving two-wheelers: SI