August 5, 2026
Explore
వన్‌వేలో ఘోర ప్రమాదం.. దంపతులు దుర్మరణం

వన్‌వేలో ఘోర ప్రమాదం.. దంపతులు దుర్మరణం

August 5, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరు సమీపంలోని జంగంపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వన్‌వేలో ఎదురుగా వచ్చిన టాటా ఇండికా కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో సదుం మండలం బొమ్మిరెడ్డిగారిపల్లెకు చెందిన బండి చలపతి (70) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య సుబ్బులమ్మ (60) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Tags: Horrific accident on one-way road; couple killed.