అమరావతిముచ్చట్లు:
నీట్ యూజీ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభమవుతుందని విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా నీట్ యూజీ రాయగా.. 11 లక్షల మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కౌన్సెలింగ్ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుందని వెల్లడించారు. జాతీయ వైద్య మండలి మార్గనిర్దేశకాల మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు సెప్టెంబరు 8 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రారంభమవుతాయని చెప్పారు.
Tags: MBBS All India Quota counseling begins today.