పుంగనూరుముచ్చట్లు:
వైఎస్సార్‌సిపి కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు గురువారం రిలేదీక్షలను వైఎస్సార్‌సిపి రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభిస్తారు. బుధవారం సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే దీక్షలలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు. డిఎస్సీలో అక్రమాలపై నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమాల్లో నిరుద్యోగులు , విద్యార్థులు, పార్టీ ప్రతినిదులు , అభిమానులు తప్పక పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags: MLA Peddireddy to hold relay hunger strike on the 6th.