పుంగనూరుముచ్చట్లు:
సీఏ చదువుతున్న రమ్యశ్రీకి ఊపిరితిత్తుల మార్పిడికి రూ.50 లక్షలు అవసరమని డాక్టర్లు తెలపడంతో విరాళాలు భారీగా అందుతోంది. బుధవారం పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆపాఠశాల చిన్నారులు తమ శక్తి మేరకు రూ.30 వేలు విరాళాలు సేకరించి , సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ కెవి.రమణ లు కలసి నగదును రమ్యశ్రీ తండ్రి వెంకట్రమణకు అందజేశారు. ఈ సందర్భంగా బాలిక తండ్రి పాఠశాల విద్యార్థులకు , సాక్షి పత్రికకు , విరాళాలు ఇస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షాహిన, జలజ, శివశంకర్, రెడ్డెమ్మ, ముభారక్, సత్య తో పాటు , వైఎస్సార్‌సిపి నాయకులు రాజారెడ్డి, ఆవుల హరిప్రసాద్ పాల్గొన్నారు.
Tags:Children donate ₹30,000 for Ramyashree’s treatment.