మరో మహిళ పరిస్థితి విషమం
పుంగనూరుముచ్చట్లు:
ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఓ మహిళ నడిచి వెళ్తున్న మరో మహిళను ఢీకొనడంతో వాహనం నడుపుతున్న మహిళ మృతిచెందగా , మరో మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మధ్యాహ్నం మండలంలోని శాంతినగర్ వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఈడిగపల్లెకి చెందిన సుబ్బరాం కుమారై లక్ష్మీ(37), తన అక్క కుమారుడు సురేంద్ర (21) తో కలసి ద్విచక్రవాహనంలో పుంగనూరులో పని నిమిత్తం వస్త్రూ మార్గమధ్యంలోని శాంతినగర్ వద్దకు చేరుకున్నారు . ఆ సమయంలో ఆగ్రామానికి చెందిన మీన(35) రోడ్డు పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి మీన ను ఢీకొని ప్రక్కన ఉన్న ఇంటిలోనికి దూరి గోడను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో లక్ష్మీ తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందింది. మీనకు తీవ్ర గాయాలైంది. సురేంద్రకు స్వల్పగాయాలైంది. ఇరువురిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మీన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ మేరకు ఎస్‌ఐ అన్సర్‌బాషా కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు చేపట్టారు.
Tags: Woman dies in road accident