August 5, 2026
Explore
మంగళంలో వైభవంగా బాలగంగమ్మ జాతర

మంగళంలో వైభవంగా బాలగంగమ్మ జాతర

August 5, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని మంగళం గ్రామంలో వెలసియున్న శ్రీబాలగంగమ్మ జాతరను బుధవారం గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయం అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. పరిసర గ్రామాల నుంచి వందలాది మంది అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. జాతర సందర్భంగా అమ్మవారికి జంతుబలులు సమర్పించారు. రాత్రి అమ్మవారిని గ్రామాల్లో వైభవంగా ఊరేగింపు చేసి, నిమజ్జనం చేశారు.

Tags:Bala Gangamma Jatara Celebrated Grandly in Mangalam