బంగ్లాదేశ్ ముచ్చట్లు:
కుక్కర్లు, గ్రైండర్లు అమ్ముతున్నట్లు నటిస్తూ ఇళ్లను రెక్కీ చేసి… రాత్రి చోరీలకు పాల్పడిన బంగ్లాదేశీ ముఠా గుట్టు రట్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్ నగర్‌లో నివాసం ఉంటున్న ఆదిలాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో గత నెల 30న భారీ చోరీ జరిగింది. ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేపట్టారు. అప్పుడు అసలు నిజాలు బయటపడ్డాయి
ప్రధాన నిందితుడు మహ్మద్ జాని అలీ గత కొన్నేళ్లలో 10-12 సార్లు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడ్డాడని పోలీసుల విచారణలో తేలింది.
దేశవ్యాప్తంగా 12-15 మంది బంగ్లాదేశీయులతో కూడిన ముఠా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తింపు.
పగలు కుక్కర్లు, గ్రైండర్లు అమ్మేవారిలా తిరిగి రెక్కీ, రాత్రి తాళాలు పగులగొట్టి చోరీలు.
రాజస్థాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో నేరాలు.
ముఠాకు సహకరించినవారు, నకిలీ పత్రాలు సమకూర్చిన వారిపై దర్యాప్తు కొనసాగుతోంది.
మిగిలిన నిందితుల వివరాలను ఐబీకి పంపించాం అని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
Tags: Theft in Adilabad by individuals from Bangladesh