August 5, 2026
Explore
గురిగింజకుంటలో పోలీసుల అవగాహన కార్యక్రమం

గురిగింజకుంటలో పోలీసుల అవగాహన కార్యక్రమం

August 5, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండలం గురిగింజకుంట పంచాయతీ పరిధిలోని హరిజనవాడ గ్రామంలో సంబేపల్లి ఎస్‌ఐ, రాయచోటి రూరల్ సీఐతో కలిసి మంగళవారం ప్రజలతో సమావేశమై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై నేరాల నివారణ, గంజాయి నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలపై ప్రజలకు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-112కు సమాచారం అందించాలని, అపరిచితుల మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన సమస్యలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

Tags:Police awareness program in Guriginjakunta