August 4, 2026
Explore
వైఎస్సార్‌సీపీ దీక్షలకు పోలీసుల అనుమతి కోరిన నేతలు

వైఎస్సార్‌సీపీ దీక్షలకు పోలీసుల అనుమతి కోరిన నేతలు

August 4, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పిలుపు మేరకు ఈనెల 6, 7, 8 తేదీలలో రిలే దీక్షలు చేపట్టనున్నారు. మంగళవారం రాత్రి మాజీ ఎంపి రెడ్డెప్ప ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సీఐ సుబ్బరాయుడు ను కలసి రిలే దీక్షలకు , 10న జరిగే నియోజకవర్గ స్థాయి ర్యాలీకి అనుమతి కోరుతు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం డిఎస్సీలో నిర్వహించిన అక్రమాలను నిరశిస్తూ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్‌ రాజీనామ చేయాలని, డిఎస్సీ అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఇక్కడ 6వ తేదీ తొలిరోజు రిలే దీక్షల్లో మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమజిల్లాల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇర్ఫాన్‌ ,యువజన సంఘ నాయకులు అస్లాంమురాధి, ఆసిఫ్‌, అఫ్సర్‌, అజీజ్‌, హేము, గౌసి, అంజాద్‌, వాహిద్‌, రఫిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: YSRCP leaders seek police permission for protests.