August 4, 2026
Explore
జిల్లాలో టెట్-2026 పరీక్షలకు సర్వం సిద్ధం

జిల్లాలో టెట్-2026 పరీక్షలకు సర్వం సిద్ధం

August 4, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

పల్నాడు జిల్లాలో ఆగస్టు 5 నుంచి 16 వ తేదీ వరకు జరగనున్న టెట్-2026 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.వి.జె. రామారావు తెలిపారు. జిల్లాలోని 5 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 9,194 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. అభ్యర్థులను పరీక్షకు గంట ముందు నుంచి మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారని, నిర్ణీత సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికిఅనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. పరీక్షకు వచ్చే వారు హాల్ టికెట్‌తో పాటు ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని, దివ్యాంగులకు 50 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈసారి ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాస్తున్నందున అభ్యర్థులందరూ ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని ఆయన సూచించారు.

Tags: Everything is ready for the TET-2026 exams in the district.